టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

Update: 2024-03-30 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మాజీ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ విచారణలో కీల విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ ను తన గుప్పిట్లో ఉంచుకుని ఓ ప్రధాన పార్టీకి బెనిఫిట్ చేకూర్చేలా వ్యవహరించినట్లు తెలిసింది. గతేడాది నవంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సదరు పార్టీకి ఆర్థిక వనరులు చేరవేయడం కోసం ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు డబ్బు తరలింపు ప్రక్రియలో రాధాకిషన్ రావు టీం కీ రోల్ పోషించినట్లు సమాచారం. పోలీసు వెహికల్స్ అయితే ఎవరికీ అనుమానం రాదని వీరు బావించినట్లు తెలిసింది. ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుండగా మరికొంత మంది ఈకేసులో అరెస్ట్ అయ్యే చాన్స్ ఉంది.  

Similar News