వరదల్లో మోరంచపల్లి గ్రామం.. ఇప్పటికే నలుగురు గల్లంతు.. ఆ 1200 మంది పరిస్థితి ఏంటి..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి లోని టేకుమట్ల మండలంలోని మోరంచపల్లి పమీప వాగు పొంగి పోర్లడంతో ఆ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది.

Update: 2023-07-27 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి లోని టేకుమట్ల మండలంలోని మోరంచపల్లి పమీప వాగు పొంగి పోర్లడంతో ఆ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. పూర్తి గ్రామాన్ని వాగు ముంచెత్తడంతో ప్రజలు ఇండ్ల పైకప్పులపై, చెట్లపై, లారీ క్యాబిన్లపై బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు కాపాడు కుంటున్నారు. ఈ వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు ఒక్కోక్కటి అందుబాటులోకి వస్తుండటంతో మోరంచపల్లి గ్రామ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో స్పష్టమవుతుంది. కాగా ఈ వరదల కారణంగా ఇప్పటికే నలుగురు గల్లంతైనట్లు సమాచారం అందుతుంది. అయితే ఆ గ్రామంలో ఉన్న 1200 మంది ఆచూకి పై ఉత్కఠ నెలకొంది. అధికారులు మాత్రం పడవలు, తెప్పిస్తున్నామని.. ప్రజలందరిని సురక్షితంగా కాపాడతామని చెబుతున్నారు.

Read More:   Moranchapalle Village : వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News