BREAKING: మరోసారి ప్రగతి భవన్‌కు MLC Kavitha.. హాట్ టాపిక్‌గా కేసీఆర్‌తో భేటీ!

ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్‌కు వెళ్లారు. శనివారం ప్రగతి భవన్‌లో తండ్రి సీఎం కేసీఆర్‌తో సుధీర్ఘ చర్చలు జరిపిన కవిత.. ఆదివారం మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Update: 2022-12-04 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం మరోసారి ప్రగతిభవన్‌కు వెళ్లారు. శనివారం ప్రగతి భవన్‌లో తండ్రి సీఎం కేసీఆర్‌తో సుధీర్ఘ చర్చలు జరిపిన కవిత.. ఆదివారం మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కవిత పేరును ప్రస్తావించడం, ఇదే కేసులో సీబీఐ జారీ చేసిన నోటీసులపై న్యాయపరమైన అంశాలపై చర్చలు జరిపేందుకు కవిత మరోసారి ప్రగతి భవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థల అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇవ్వాలని ప్రగతి భవన్‌లో నిపుణులతో కవితకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం.

ఇక, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. సీఎం కేసీఆర్‌తో వరుసగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే, శనివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో చర్చల అనంతరం కవిత సీబీఐ అధికారులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని.. ఈ డాక్యుమెంట్స్ పంపిన తర్వాతే విచారణ తేదీ ఫిక్స్ చేయాలని ఆమె లేఖలో కోరారు. కాగా, దీనిపై ఇంకా సీబీఐ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత విచారణకు హాజరు కానుండటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Also Read....

శుభవార్త.. డబుల్ బెడ్ రూం ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకోండి

Tags:    

Similar News