నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది.

Update: 2024-05-25 03:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండగా.. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ పరిధిలో ఉపఎన్నిక జరగనుంది. జూన్ 5న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు.

Similar News