తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కామ్.. ఆధారాలు కూడా ఉన్నాయి.. మరో బిగ్ బాంబ్ పేల్చిన మహేశ్వర్ రెడ్డి

బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై విమర్శల పర్వం కంటిన్యూ చేస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్

Update: 2024-05-22 13:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై విమర్శల పర్వం కంటిన్యూ చేస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా ట్రాక్ మార్చి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ యూ ట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఇష్యూపై మంత్రి ఉత్తమ్, మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరగగా.. తాజాగా మహేశ్వర్ రెడ్డి మరోసారి ఉత్తమ్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కలెక్షన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్, సివిల్ సప్లైయ్స్ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇద్దరూ కలిసి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. తాను చేసిన ఈ ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో బహిరంగ చర్చకు నేను సిద్ధమని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. కాగా, సీఎం పోస్ట్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ.500 కోట్లు పంపించారని అంతకముందు మహేశ్వర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. 

Similar News