జగదీష్​రెడ్డిని రాళ్లతో కొడతారు: బీర్ల అయిలయ్య

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శిస్తే జగదీష్​రెడ్డిని ప్రజలే రాళ్లతో కొడతారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సీరియస్ అయ్యారు.

Update: 2024-05-25 13:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శిస్తే జగదీష్​రెడ్డిని ప్రజలే రాళ్లతో కొడతారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సీరియస్ అయ్యారు. జగదీష్​రెడ్డి ఇంకా పవర్‌లో ఉన్నామనే భ్రమలో ఉన్నాడని, బీఆర్ఎస్ పని అయిపోయిందనే విషయాన్ని గుర్టు పెట్టుకుంటే మేలని ఆయన జగదీష్​రెడ్డికి సూచించారు. కేసీఆర్ దగ్గర ఊడిగం చేసుకో అని బీర్ల అయిలయ్య శనివారం ఓ వీడియోలో విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు నోరు అదుపులో పెట్టుకొవాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తల్లి సోనియా గాంధీ తప్పని సరిగా వస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత కాబట్టే సీఎం ఆహ్వానించారన్నారు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, జగదీష్ రెడ్డికి పదవులు ఎలా వచ్చేవి? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేసింది కేసీఆరే అని గుర్తు చేశారు. రాష్ట్రం ఇచ్చినప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబం సోనియమ్మ కాళ్ల దగ్గర మోకరిల్లి టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామని, మోసం చేశారన్నారు. సోనియమ్మ ను విమర్శిస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

Tags:    

Similar News