మునుగోడులో బీజేపీ పప్పులు ఉడకవు: వేముల

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎన్ని డ్రామాలు ఆడినా మునుగోడులో బీజేపీ పప్పులు ఉడకవని ఎద్దేవా చేశారు.

Update: 2022-10-08 10:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎన్ని డ్రామాలు ఆడినా మునుగోడులో బీజేపీ పప్పులు ఉడకవని ఎద్దేవా చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాదని విమర్శించారు. కేవలం కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలోని దామెర గ్రామంలో మంత్రి వేముల ప్రచారం నిర్వహించారు.

Tags:    

Similar News