కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలు నాశనం: మంత్రి తుమ్మల

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Update: 2024-05-25 11:43 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: గత పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కేసీఆర్.. నియంతృత్వంగా ప్రవర్తించాడని అన్నారు. అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల ఎదుట పెట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం గతంలో మాదిరిగానే భవిష్యత్తులో కూడా తీన్మార్ మల్లన్న కొట్లాడుతారని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గతంలో తాను ఓడిపోయినప్పటికీ ఏనాడూ ప్రజలకు దూరంగా లేను అని చెప్పారు. మూడేళ్లుగా ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నానని అన్నారు. హక్కుల కోసం కొట్లాడుతున్న తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను ఓడించడమే లక్ష్యంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపించిన తర్వాత బీఆర్ఎస్ నిరుద్యోగులను నడిరోడ్డుమీద వదిలేసిందని అన్నారు. తనపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తను ఏనాడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయలేదు అన్నారు. కేటీఆర్ తనపై చేస్తోన్న ఆరోపణలను నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

ఎమ్మెల్సీగా గెలిస్తే పట్టభద్రులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానని అన్నారు. ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీన్మార్ మల్లన్న గెలిపించాల్సిన బాధ్యత నిరుద్యోగ యువతపై ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకు రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్లు ఖయ్యాం బేగ్, బొజ్జ శంకర్, ప్రదీప్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు కుడతాల నాగరాజు, ఇరుగు మధు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News