నంది అవార్డుల వివాదంపై తలసాని హాట్ కామెంట్స్

నంది అవార్డులపై కొందరు అత్యుత్సాహంగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నంది అవార్డులను కమ్మవాళ్లకే ఇస్తున్నారని సినీ నటుడు పోసాని విమర్శలు చేశారు.

Update: 2023-05-04 11:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నంది అవార్డులపై కొందరు అత్యుత్సాహంగా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నంది అవార్డులను కమ్మవాళ్లకే ఇస్తున్నారని సినీ నటుడు పోసాని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని స్పందిస్తూ నంది అవార్డుల పలనా వాళ్లకు ఇవ్వండని ఎవరూ కూడా తమ ప్రభుత్వానికి ప్రతిపాదించలేదని తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. వచ్చే ఏడాది సినిమా వాళ్లకు తామే అవార్డులిచ్చే యోచనలో ఉన్నామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని చేయాలో అన్ని చేశామని చెప్పారు. హైదరాబాద్ చిత్రపురికాలనీలో దాసరి నారాయణ విగ్రహాన్ని మంత్రి తలసాని ఆవిష్కరించారు. పూల మాలలు వేసి నివాళర్పించారు.

Tags:    

Similar News