ఆ కంపెనీ ఎక్కడికి వెళ్లిందో KTR ఆన్సర్ చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో

Update: 2024-05-26 12:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్నింగ్ అనే సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూనే కుదుర్చుకోలేదని, అలాంటిది ఆ కంపెనీ తెలంగాణ నుండి వెళ్లిపోయిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుండి కంపెనీలు వెళ్లిపోతున్నాయంటున్న కేటీఆర్.. ఆ కంపెనీలు ఎక్కడికిపోయాయో ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హాయాంలో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మరో రూ.9 వేల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్స్ రానున్నాయని తెలిపారు.

ఇటీవల వరంగల్‌లోని ఎంజీఎంలో ఆసుపత్రిలో జనరేటర్ ప్రాబ్లమ్ వల్ల విద్యుత్ ప్రసారంలో అంతరాయం ఏర్పడిందని.. కరెంట్ సరఫరాలో ఎలాంటి కోతలు లేవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంజీఎంలో 120 సార్లకు పైగా కరెంట్ సమస్య వచ్చిందని.. పేషేంట్లను ఎలుకలు కొరికాయని.. మరీ దీనిపై మాజీ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని.. దీని వల్ల సివిల్ సప్లై మినిష్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పేరు వస్తుందని, అది ఓర్వలేక ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

Similar News