‘అందరికీ తెలుసు’.. BRS కార్యకర్త హత్యపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త హత్యకు గురికావడంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి కీలక

Update: 2024-05-24 15:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త హత్యకు గురికావడంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డికి చెడు అలవాట్లు, కుటుంబ తగదాలు ఉన్నాయని, ఈ విషయం వాళ్ల గ్రామంలో అందరికీ తెలుసని అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నా ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధికోసం బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలను చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, శ్రీధర్ రెడ్డి మర్డర్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని అధికార పార్టీపై గులాబీ లీడర్స్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం తెలిపారు. 

Similar News