ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కమిటీలు రద్దు :ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు మొత్తం కమిటీలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలు (యూత్, మహిళ, బీసీ సెల్,ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యూత్ ) కమిటీలు మొత్తం రద్దు చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రకటించారు.

Update: 2024-05-23 09:12 GMT

దిశ, ఉప్పల్: బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు మొత్తం కమిటీలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలు (యూత్, మహిళ, బీసీ సెల్,ఎస్సీ సెల్,ఎస్టీ సెల్, బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యూత్ ) కమిటీలు మొత్తం రద్దు చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు త్వరలోనే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.

Similar News