రాజ్యాంగాన్ని మోదీ మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు : ఈటల

రాజ్యాంగాన్ని మోదీ మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు ప్రతి పక్షాలు

Update: 2024-05-02 09:34 GMT

దిశ,మేడిపల్లి: రాజ్యాంగాన్ని మోదీ మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు ప్రతి పక్షాలు చేస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన బోడుప్పల్, వివేకానందనగర్ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్న ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో తనకు తెలుసు అని వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదు అని, వారి వృత్తి , వ్యాపారాలలో బిజీగా ఉంటారు అని, మేము ఎదురు పడిన అంత పట్టించుకోరు ఓట్లప్పుడు మాత్రం అడగడానికి వస్తారు.సమస్యలు చెప్తే మాత్రం పట్టించుకోరు అని వారు భావిస్తారని ఈటల అన్నారు. కానీ మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, మౌలిక వసతులు కల్పించడానికి రాజకీయ నాయకుల అవసరం ఉంటుంది. కేవలం హామీలను, కులాలను పట్టించుకోకండి, హామీలు ఇవ్వడం కాదు, అవి ఎంతవరకు నెరవేరుస్తారు అనేది ఆలోచించండి అని అన్నారు. ఇంత పెద్ద బాద్యతను తలకెత్తుకునే వారికి ఓటు వేసేటప్పుడు ఎవరైతే ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తారో వారికే ఓటు వేయండి అని తెలిపారు.రాజ్యాంగాన్ని మోదీ మార్చేస్తారని అబద్దపు ప్రచారాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పటికీ అతి ఎక్కువ సార్లు రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని,అప్పటికప్పుడు అబద్దాలతో ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు.

Similar News