వృద్దుడు అదృశ్యం..

వృద్ధుడు అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో

Update: 2024-05-27 13:05 GMT

దిశ,దుండిగల్ : వృద్ధుడు అదృశ్యమైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే డి పోచంపల్లి 60 గజాల కు చెందిన బాలకృష్ణ మార్కెటింగ్ పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. అతని తల్లి చికిత్స నిమిత్తం అరుంధతి ఆసుపత్రిలో చేరింది. ఆమెను చూడడానికి వెళ్లిన అతని తండ్రి బాల స్వామి(65) ఆదివారం అదృశ్యమయ్యాడు. తెలిసిన చోటా,చుట్టూ పక్కలా విచారించిన ఆచూకీ ల లభించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News