కాలం చెల్లిన ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు.. కల్తీ ఆహార పదార్ధాలతో వ్యాపారుల దందా

కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్తీ ఆహార ఉత్పత్తులు చలామణి

Update: 2024-05-02 13:07 GMT

దిశ,కాప్రా : కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కల్తీ ఆహార ఉత్పత్తులు చలామణి అవుతున్న అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో విచ్చల విడిగా కాలం చెల్లిన ఆహార ఉత్పత్తుల విక్రయాలు జోరుగానే కొనసాగుతున్నాయి. తాజాగా కాప్రా సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న మోర్ సూపర్ మార్కెట్ లో సంవత్సరం కాలం నాటి ఐస్ క్రీములు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు గుర్తించారు. కమలా నగర్ కాలనీకి చెందిన వినియోగదారుడు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో కాప్రా ఏఎమ్ హెచ్ ఓ వెంకటరమణ ఆర్భాటంగా తనిఖీలు చేసి చేతులు దులుపుతున్నారాని, సదరు కంపెనీ యాజమాన్యం పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వినియోగదారులు వాపోతున్నారు . ఫుడ్ కోర్డులో ఆహారం సేవించి పలువురు అస్వత్తతకు గురైన సంఘటనలు కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్నాయి. హోటల్స్, తినుబండారాల వ్యాపారులపై తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News