చంచల్‌గూడ‌ జైలులో ర్యాగింగ్.. ర్యాగింగ్! నిందితులైన పోలీసు ఆఫీసర్ల రాక కోసం అంతా వెయిటింగ్

టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా.. చర్చనీయాంశం అవుతోంది.

Update: 2024-03-29 05:38 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా.. చర్చనీయాంశం అవుతోంది. అయితే ఆయన బారిన పడి ఇప్పటికే జైలు పాలైన, వారితో వేధింపులకు గురైన కొందరు అమాయకులు రాధాకిషన్ రావుకు తగిన శాస్తే జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడిగా  జైలుకు వస్తున్నారనే సమాచారం తెలియడంతో సంతోషిస్తున్నారని తెలుస్తోంది. ఆయన వల్ల అరెస్టు అయిన చాలా మంది బాధితులు చంచల్‌గూడ జైలులో ఉండడం‌తో రాధాకిషన్ రావు ర్యాంగింగ్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గంజాయి, హవాలా, చోరీ కేసులలో అరెస్టు వారి నుంచి టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు తీవ్ర స్థాయిలో ర్యాగింగ్ ఉంటుందనే టాక్ చంచల్‌గూడ జైలులో వనిపిస్తోంది. 

Similar News