కట్ట మైసమ్మ ఆలయంలో ఈటల నామినేషన్ పత్రాలకు పూజలు

మల్కాజ్గిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి ఈటల జమున ప్రత్యేక పూజలు చేయించారు.

Update: 2024-04-18 04:29 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: మల్కజ్‌గిరి బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలను ఆయన సతీమణి ఈటల జమున ప్రత్యేక పూజలు చేయించారు. శుక్రవారం శామీర్ పేట్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరి లో రాజేందర్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని అకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు అదరిస్తున్నారని తెలిపారు. మల్కాజ్‌గిరి సమగ్రాభివృద్ది కోసం బీజేపీకి ఓటేయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు


Similar News