మోడీని కించపరుస్తూ వరంగల్ హైవే పిల్లర్లకు పోస్టర్లు కలకలం..

ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం 956 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-03-29 12:00 GMT

దిశ, మేడిపల్లి : ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం 956 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా గుత్తెందారు నిర్లక్ష్యం వల్ల, ల్యాండ్ అక్వేజషన్ వల్ల కారిడార్ నిర్మాణం ఆలస్యం అవుతుంటే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానినరేంద్ర మోడీని కించపరుస్తూ మంగళవారం వరంగల్ జాతీయ రహదారి పై ఉన్న పిల్లర్లకు పోస్టర్లు వేసి కించపరిచారని.. పోస్టర్లు వేసిన గుర్తుతెలియని వ్యక్తుల పై ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని బుధవారం మేడిపల్లి సీఐ గోవర్ధనగిరిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ బీజేపీ అధ్యక్షులు అనిల్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లర్లకు అతికించిన పోస్టర్లను సిబ్బంది తొలగించారు.

Tags:    

Similar News