ఆదిపురుష్​ సినిమాను వీక్షించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

రామాయణ ఇతి వృత్తాన్ని ప్రేక్షకులకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2023-06-16 15:18 GMT

దిశ, కూకట్​పల్లి : రామాయణ ఇతి వృత్తాన్ని ప్రేక్షకులకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం విడుదలైన ఆదిపురుష్​ సినిమాను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ రామాయణాన్ని ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర దర్శకులు, నిర్మాతలు చేసిన కృషి అభినందనీయమని, రామాయణ ఇతి వృత్తాన్ని, భారతదేశ సంప్రదాయాలు, ధర్మాన్ని భావి పౌరులకు అందించేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రముఖ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి వర్డెక్స్​ వర్మ, బీఆర్​ఎస్ నాయకులు శ్యామలరాజు తదితరులు సినిమాను వీక్షించారు.

Tags:    

Similar News