Hyderabad rains: వర్షాలతో స్థంభించిన జనజీవనం

గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగర జనజీవనం స్థంభించింది.

Update: 2023-07-20 10:50 GMT

దిశ, అల్వాల్: గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగర జనజీవనం స్థంభించింది. అల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు రోడ్లు జలమయంగా మారాయి. జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది. వాహనదారులు వరదనీటీలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొన్ని వాహనాలు నీటిలో ఆగిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఇది ఇలాగే మరో రెండు రోజులు కొనసాగితే లోతట్టు ప్రాంతాలలోని నివాస ప్రాంతాలు వరదముంపుకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News