మల్లారెడ్డిని వెంటాడుతున్న భూ వివాదాలు.. బొమ్మ రాశి పేట భూమిలో ప్రహరీ కూల్చివేత

మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యేకు మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది.

Update: 2024-05-24 11:18 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యేకు మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలుగులోకి రాని తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం మారగానే ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇటీవల మైసమ్మగూడలో తన కళాశాలకు వేసిన రోడ్డును అక్రమ నిర్మాణం అంటూ హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేతలు చేపట్టగా, మొన్న దుండిగల్ లో తన స్వయానా అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి చెందిన కాలేజ్ లో ఎఫ్డీఎల్ లో నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నిన్నటికి నిన్న సుచిత్ర లో భూ వివాదంలో ఏకంగా మాజీ మల్లారెడ్డి తో పాటుగా ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ల పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎఫ్ టీఎల్ లో ప్రహారీ కూల్చివేత..

మేడ్చల్ జిల్లా, శామీర్పేట్ మండలం, బొమ్మ రాసి పేట పెద్ద చెరువులో ఎఫ్ టిఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను కూచవేశారు. ఈ గ్రామంలో సర్వే నెంబర్ సర్వేనెంబర్ 315, 407, 48 లలో మాజీ మంత్రి మల్లారెడ్డి కి ఆరు ఎకరాలు భూమి ఉంది.కాగా చెరువు ఎఫ్ టిఎల్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు అందాయి.జెసీబీల సాయంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చెరువులో నిర్మించిన రక్షణ గోడలను కూల్చివేశారు. పెద్ద చెరువును అక్రమించి నిర్మించిన మరికొన్ని నిర్మాణాలను కూడా అధికారులు కూల్చేశారు.

వెంటాడుతున్న భూ వివాదాలు..

కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82, 83 లో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండున్నర ఎకరాల భూమి తమదేనని వాదిస్తున్నారు. 1.11 ఎకరాల భూమి తమదని మరో 15 మంది చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం సర్వే నెం.82 లోని స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మరో 15 మంది మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశారని 15 మంది పేర్కొనగా, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చింది.అయితే ఈ స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ఆ స్థలంలో ఎలాంటి గొడవలు జరగవద్దని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. అయితే మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మల్లారెడ్డి బాధితులు సమావేశం నిర్వహించారు. మల్లారెడ్డిపై మరోసారి బాధితులు సంచలన ఆరోపణలు చేశారు.

పూలు, పాలు అమ్మడమే కాదు.. మల్లారెడ్డి భూకబ్జాలు కూడా చేస్తున్నాడని, మల్లారెడ్డి పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 82 లో ఎకరాకు 29 గుంటల కంటే ఎక్కువగా ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని… అయితే ఆయన ఆదివారం దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో మల్లారెడ్డికి చెందిన ఎకరం 29 గుంటలతో పాటు మల్లారెడ్డి కి చెందిన 33 గుంటలను చేర్చారని తెలిపారు. మా 33 గుంటలు మాకు ఇవ్వాలని ఎ

Similar News