రికార్డ్.. బాలాపుర్లడ్డూ కన్నా రెట్టింపు ధర పలికిన కానాజీగూడ గణపతి లడ్డూ
నగరంలో ఎక్కడాలేనివిధంగా అత్యంత ఎక్కువ ధరకు గణనాథుని లడ్డును గీతప్రియా వెంకట్రావ్దంపతులు సొంతం చేసుకున్నారు...Khanajiguda Ganesh Laddu auctioned for record-breaking price of Rs. 45.99 Lakh
దిశ, అల్వాల్: నగరంలో ఎక్కడాలేనివిధంగా అత్యంత ఎక్కువ ధరకు గణనాథుని లడ్డును గీతప్రియా వెంకట్రావ్దంపతులు సొంతం చేసుకున్నారు. నగరంలో బాలాపూర్ లడ్డే అధికం అనుకుంటే దానికి డబుల్ధరతో అల్వాల్సర్కిల్కానాజీగూడలోని మరకత లక్ష్మీగణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ వేలంలో ధర పలికింది. బాలాపూర్ లడ్డూ రూ.24.60 లక్షలు పలుకగా మరకత లక్ష్మీగణపతి లడ్డూ వేలం ధర రూ.45 లక్షల 99 వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయాలు పలికిందని ఆలయ కార్యనిర్వాహకులు డాక్టర్ మోత్కూరి సత్యనారాయణ శాస్త్రీ తెలిపారు. ఈ లడ్డూను గీత ప్రియ వెంకట్రావ్దంపతులు కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం సైతం లడ్డూ వీరికే దక్కడం గణపతి కృప వల్లనే సాధ్యం అయిందని ఆయన కటాక్షం వల్లనే తాము ఉన్నత స్థాయిలో ఉన్నామని వెంకట్రావ్ దంపతులు తెలిపారు. ఆ డబ్బుతో ఆలయం ఆధ్వర్యంలో జరుగు నిత్య అన్నదానానికి, ఆలయ అభివృద్ధికి, ఆలయానికి కావాలసిన స్థల సేకరణకు వినియోగిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.