అత్యాధునిక పనిముట్లను అందచేసిన జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని, దీనిని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ , మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.

Update: 2022-09-22 14:20 GMT

దిశ ప్రతినిధి,మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని, దీనిని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ , మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా కుమ్మరి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన కుమ్మరి కళాకారులకు ఆధునిక పనిముట్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదుగురు కళాకారులకు లక్ష రూపాయల విలువైన ఆధునిక పనిముట్లను అందించగా.. అందులో రూ.80 వేలు సబ్సిడీ ఉంటుందని రూ.20 వేలు లబ్ధిదారుల వాటా ఉంటుందని దీనిని వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేశం, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి ఝాన్సీరాణి, కుమ్మరి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Similar News