హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు

కంటోన్మెంట్ మారేడ్‌పల్లిలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2022-09-24 12:57 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ మారేడ్‌పల్లిలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్కడి వసతులు ఏవిధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకోవడమే కాక, తమకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన కల్పించారు. చదువుతో పాటు సంస్కారం కూడ ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంబంధాల అధికారి శ్రీనివాస్ రావు, గట్టు మధు, వెంకటేశం, లీగల్ సొసైటీ క్యాంప్ సభ్యులు సురేష్, దయాకర్, వార్డెన్ మనోహర్, ఎస్‌ఐ సౌమ్య పాల్గొన్నారు.

Similar News