బోడుప్పల్ లో 2023 - 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ..

బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ శుక్రవారం మేయర్ సామల బుచ్చి రెడ్డి అధ్యక్షతన ప్రవేశపెట్టారు.

Update: 2023-03-31 11:12 GMT

దిశ, మేడిపల్లి : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ శుక్రవారం మేయర్ సామల బుచ్చి రెడ్డి అధ్యక్షతన ప్రవేశపెట్టారు. 69 కోట్ల 78లక్షలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ కు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం బడ్జెట్ ముఖ్యఅంశాలు ప్రారంభ విలువ 3.83 కోట్లు, ఆస్తి పన్నువసూల్ అంచనా 14.00 కోట్లు, ఇతర పన్నులు అంచనా 39.88 కోట్లు, డిపాజిట్ & అడ్వాన్స్ రూపంలో 1.20 కోట్లు రూపాయలతో మొత్తం అంచనా 58.92 కోట్లు ఆదాయం వేశారు.

గ్రాంట్ల రూపంలో 10.85 కోట్ల రూపంలో వస్తాయని అంచనా వేశారు. సొంత ఆదాయం & గ్రాంట్ల రూపంలో కలపుకొని 69.77 కోట్ల అంచనాలతో 2023-24 బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో వార్డుల వారిగా సమస్యల తీవ్రతను బట్టి అభివృద్ధి పనులు చేపడుతామని కమీషనర్ సభ్యులకు తెలియజేశారు. అలాగే నగర పాలక సంస్థ ఆదాయం పెంచే విధంగా అవసరమైన చర్యలు చేపడతామని కమీషనర్ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

Tags:    

Similar News