సర్కారు దవాఖానల్లో మెరుగైన సేవలు అందించాలి : కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన సేవలు

Update: 2024-05-24 13:23 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో కాన్ఫరెన్స్ హాల్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఒక్కొక్క విభాగాల వారీగా సమీక్షిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ఎంత మేరకు జరుగుతున్నాయని గౌతమ్ తెలుసుకున్నారు. సిజేరియన్ (సి సెక్షన్) తగ్గించాలన్నారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ తప్పనిసరిగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి సి సెక్షన్ ఆడిట్ నిర్వహించాలన్నారు.బస్తీ దవాఖాన లో మెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. స్క్రీనింగ్ పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయని, ఎలా నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ క్రింద ఎన్ని కేసులు వచ్చాయని ఆరా తీశారు.108 వెహికల్ పని తీరు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

స్క్రీనింగ్ పరీక్షలు తదుపరి బస్తీ దవాఖానా, పిహెచ్ సి లలో హైపర్ టెన్షన్, షుగర్ మందులను పంపిణీ గురించి, నెలకు ఎంతమంది తీసుకుంటున్నారని అధికారులు వివరించారు . మందులు తీసుకొని వారికి అవగాహన కల్పించి ప్రభుత్వం వారు ఫ్రీగా మందులు ఇస్తున్నారని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. జిల్లా లో ఆర్ బి ఎస్ కే టీముల పనితీరు గురించి సంబంధిత అధికారులు వివరించారు. ఎన్ డి సి, ఇమ్యునైజేషన్ ,మాత ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయాలన్నారు. బర్త్ ప్లానింగ్, కాన్పుల సంఖ్య ఎన్ సి డి, టెలి కన్సల్టేషన్ సేవల పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వంద శాతం గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకు వెళ్లేలా వైద్య అధికారులు ప్రోత్సహించాలన్నారు.టి బి రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు . పీహెచ్ సీ లలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. మినీ హబ్స్ ఏర్పాటు గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య,జిల్లా వైద్యాధికారి రఘునాథ స్వామి, డిసీహెచ్,ప్రోగ్రాం ఆఫీసర్లు, సూపర్నెంట్,జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, అధికారులు పాల్గొన్నారు.

Similar News