రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన

Update: 2024-05-08 13:16 GMT

దిశ,మేడ్చల్ టౌన్: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ ఎస్సై మజీద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల రెండో తేదీన మేడ్చల్ పట్టణంలోని సీజన్ బార్ ఎదురుగా గుర్తు తెలియని మహిళ రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో మహిళ కు తీవ్ర గాయాలయ్యాయి, చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. సుమారుగా మహిళ వయసు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News