కాంగ్రెస్‌లోకి మేడ్చల్ మున్సిపల్ చైర్మన్..?

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేటట్లు ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ హస్తం గూటికి చేరుతున్నారు.

Update: 2024-05-08 07:09 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేటట్లు ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం మేడ్చల్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మర్రి దీపిక భర్త మర్రి నర్సింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకోంది. ఘట్‌కేసర్ మండలంలోని ప్రతాప సింగారంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మర్రి నర్సింహారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో మర్రి నర్సింహారెడ్డితో సహా ఆయన సతీమణి, మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 

కాగా మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన 12 మంది బీఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం విధితమే. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఛైర్ పర్సన్ మర్రి దీపిక పై అసమ్మతి కార్పేటర్లు అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టారు. త్వరలో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నుంచి తప్పించుకొని చైర్మన్ పదవిని కాపాడుకునేందుకే మరి నరసింహారెడ్డి కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటివల కాంగ్రెస్ పార్టీలో చేరిన అసమ్మతి కార్పొరేటర్లు మాత్రం మర్రి దీపిక, ఆమె భర్త నర్సింహారెడ్డి కాంగ్రెస్ లోకి రావాడాన్ని అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News