విషాదం.... మార్చిలో నిశ్చితార్థం అంతలోనే ఆత్మహత్య

తీవ్రమైన పని ఒత్తిడితో పీజీ మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2024-02-13 13:36 GMT

దిశ, పటాన్ చెరు: తీవ్రమైన పని ఒత్తిడితో పీజీ మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మెడికో విద్యార్థిని రచన రెడ్డి (23) బాచుపల్లిలోని మమత మెడికల్ కాలేజీలో పీజీ మెడికల్ చదువుతుంది. అయితే పని ఒత్తిడి అధికంకావడంతో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేట ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్ వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మార్చిలో రచన రెడ్డి నిశ్చితార్థం కావాల్సి ఉండగా పని ఒత్తిడితో డిప్రెషన్‌కు లోనై కారు లో ఆత్మహత్య చేసుకుందని, తమకెలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతదేహానికి పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అమీన్ పూర్ సీఐ నాగరాజు తెలిపారు.

Similar News