ఈదురుగాలుల బీభత్సం... భారీగా ఆస్తినష్టం

మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

Update: 2024-05-23 14:07 GMT

దిశ, పాపన్నపేట : మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అబ్లాపూర్ గ్రామంలో వడ్ల సంగమేశ్వర్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి గోడలు కూలిపోయాయి. పలు గ్రామాల్లో సిమెంటు రేకులు సైతం ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. మరికొన్ని గ్రామాల్లో

     పూరి గుడిసెలపై గడ్డి కొట్టుకుపోయింది. కుర్తివాడ గేటు వద్ద రోడ్డుపై వృక్షం, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. అక్కడక్కడా ఈదురు గాలులతోపాటు వర్షం కూడా పడడంతో వాతావరణం కొంతవరకు చల్లబడింది. ఇల్లు కూలిపోవడం, ఇళ్లపై రేకులు ఎగిరిపోవడంతో తాము నివసించడానికి కనీసం గూడు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News