మొత్తం ధాన్యం కొనే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి

Update: 2024-05-23 15:25 GMT

దిశ, కొల్చారం : జిల్లాలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మండలంలోని వరిగుంతంలో ఏర్పాటు చేసిన సెంటర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరిగుంతం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉన్నందున త్వరితగతిన కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేసి మిల్లుకు ధాన్యం తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. గత ఖరీఫ్ లో వరిగుంతం కొనుగోలు కేంద్రంలో 16,994.80 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి 389 రైతులకు 3.74 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. ఈ యాసంగి 2023- 24 లో ఇప్పటివరకు 380 మంది రైతుల

    నుండి 17,158 సంచుల ధాన్యం కొనుగోలు చేశారని, ఇంకా సుమారుగా 4000 క్వింటాళ్ల ధాన్యం ను కొనుగోలు చేసి ఒక వారంలో ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తిచేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని, జిల్లాలో మొత్తం 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 2,27,707.800 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 52,575 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి రూ 367.23 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. 123 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తయింది అన్నారు. జిల్లాలోని 34 బాయిల్డ్ మిల్లులు, 31 రా మిల్లులకు ధాన్యం కేటాయించినట్టు తెలిపారు. మన జిల్లా నుండి సిద్దిపేట జిల్లాకు 10,000 మెట్రిక్ టన్నుల, మహబూబ్నగర్ జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని పంపించనున్నట్టు పేర్కొన్నారు.

     ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా 600 పైగా లారీలు అందుబాటులో ఉన్నామన్నారు. ఇవి కాకుండా అదనంగా 150 లారీల వరకు తెప్పించనున్నట్టు తెలిపారు. అకాల వర్షాలకు రైతులు కంగారు పడొద్దని ప్రతి రైతు పండించిన ప్రతి ధాన్యం చివరి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా ఫౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు , కొల్చారం తహసీల్దార్ గౌస్ మియా, సహకార సంఘం చైర్మన్ చిన్నారపు ప్రభాకర్ , బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యం గారి సంతోష్, సహకార సంఘం సీఈఓ రాములు, మాజీ చైర్మన్ బొడాల నరసింహులు, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఉపాధ్యక్షులు గోవర్ధన్, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

Similar News