స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంల పై ప్రత్యేక నిఘా

స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్న ఈవీఎంలపై ప్రత్యేక నిఘా ఉంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి భద్రత సిబ్బందికి సూచించారు.

Update: 2024-05-25 12:16 GMT

దిశ, సంగారెడ్డి : స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్న ఈవీఎంలపై ప్రత్యేక నిఘా ఉంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి భద్రత సిబ్బందికి సూచించారు. శనివారం రుద్రారం గీతం యూనివర్సిటీ కళాశాలలో జూన్ 4న జరుగనున్న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోని భద్రత ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్రం వద్ద పోలీస్ భద్రతను,

    సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ రికార్డు లను, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను, స్ట్రాంగ్ రూమ్ కంట్రోల్ రూమ్ రికార్డులను, కంట్రోల్ రూమ్ రికార్డులను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత కట్టుదిట్ట మైన ఏర్పాట్లతో పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భద్రత సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో బారీకేట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయని, కౌంటింగ్ సిబ్బందికి, పోలింగ్ ఏజెంట్స్ కి వేరువేరుగా మార్గాలు సిద్ధం అయ్యాయని ఆర్ అండ్​ బీ, ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంగ్టి తహసీల్దార్ విష్ణు సాగర్, ఆర్ అండ్ బీ డిప్యూటీ ఈఈ రవీందర్, సర్వేయర్ కోటేశ్వరావు, డీఎస్పీ సత్తయ్య, సీఐ నయీముద్దీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News