బీఆర్ఎస్ కు షాక్..

ఖేడ్ నియోజకవర్గం కల్హర్ మండలం ఫతేపూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టోల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2023-08-31 10:08 GMT

దిశ, నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గం కల్హర్ మండలం ఫతేపూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టోల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇంటింటికి ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ తో గ్రామాల అభివృద్ధి చెందాయన్నారు. అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అన్నారు. అబ్రహం, నారా గౌడ్, గంగిల సాయి గౌడ్, మాదపల్లి పెద్ద ఎల్లయ్య, నందన్ పెద్ద సాయిలు, వీరయ్య, జయరాజ్, సాయిలు, మాదపల్లి బాలవ్వ, మేత్రి బారమ్మ, మాలపల్లి సాయమ్మ, కసాబాద్ జైలు, సాయిలు, తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి శ్యాం ప్రసాద్ ముదిరాజ్, ఏసప్ప, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News