లోక్ సభ ఎన్నికల నామినేషన్ల భద్రతా ఏర్పాట్లు పూర్తి

నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టామని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు.

Update: 2024-04-17 15:51 GMT

దిశ, మెదక్ టౌన్ : నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టామని మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు జరుగుతుందని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.

     దాని కోసం సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహించనున్నట్టు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News