సంగారెడ్డిలో వాహనాలు వదిలేసి పరారైన పిన్నెల్లి బ్రదర్స్

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్ల నియోజకవర్గానికి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజు ఈవీఎం మెషిన్ ను ధ్వంసం చేశాడు.

Update: 2024-05-22 09:19 GMT

దిశ, కంది : తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్ల నియోజకవర్గానికి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజు ఈవీఎం మెషిన్ ను ధ్వంసం చేశాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే అతడిని అరెస్టు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో

    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో పాటు అతని సోదరుడు పరారయ్యారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద పిన్నెల్లి సోదరులు తమ వాహనాల్లో సెల్ ఫోన్లు వదిలేసి అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందడంతో వారి వాహనాలతో పాటు ఒక అనుచరున్ని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

Similar News