ఈనెల 27న ట్రైడెంట్ కర్మాగారం ప్రీమియం బకాయిల చెల్లింపు

జహీరాబాద్ లోని ట్రైడెంట్ చెక్కర కర్మాగారం రైతులు ,కార్మికులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ బకాయిలు మొత్తం ఈ నెల 27 తేదీలోగా యాజమాన్యం చెల్లించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి ఆదేశించారు.

Update: 2024-05-22 15:43 GMT

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ లోని ట్రైడెంట్ చెక్కర కర్మాగారం రైతులు ,కార్మికులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన వివిధ బకాయిలు మొత్తం ఈ నెల 27 తేదీలోగా యాజమాన్యం చెల్లించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి ఆదేశించారు. బుధవారం పరిశ్రమలోని కార్మిక సంఘాల నాయకులు, పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ రామ్నాథ్ కు మధ్య జిల్లా కలెక్టర్ , జిల్లా కార్మిక శాఖ అధికారి, షుగర్ కేన్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కార్మికులకు యాజమాన్యానికి మధ్య కుదిరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ట్రైడెంట్ చెక్కర కర్మాగార యజమాని కార్మికులకు వేతన బకాయిలు పీఎఫ్ , గ్రాట్యుటీ , ఎల్ఐసీ ప్రీమియం

    బకాయిలు మే 27వ తేదీన చెల్లించేందుకు ట్రైడెంట్ కర్మాగారం మేనేజింగ్ డైరెక్టర్ రామ్నాథ్ అంగీకరించి హామీ పత్రం ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్మికులకు రావలసిన మూడు నెలల వేతన బకాయిలు ఈనెల 27న కార్మికుల ప్రతినిధులతో జరిగే ఒప్పందం మేరకు చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. చెక్కర పరిశ్రమ నడపడానికి సంబంధించిన అన్ని రకాల చెల్లింపులు, రైతుల బకాయిలు, జీఎస్టీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇతర పన్నులు, అన్నీ కలిపి జూలై 1.2024 రోజున చెల్లింపులు చేసి పరిశ్రమ తిరిగి పున: ప్రారంభించాడానికి అన్ని చర్యలు తీసుకోనున్నట్లు పరిశ్రమ యాజమాన్యం అంగీకరించి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ రవీందర్ రెడ్డి, కమిషనర్ రాజశేఖర్, కార్మిక సంఘం నాయకులు ఎంజీ.రాములు ట్రైడెంట్ చెక్కర పరిశ్రమ కార్మికులు, యాజమాన్యం పాల్గొన్నారు.

Similar News