రేపటి నుండి రైతు బంధు డబ్బులు విడుదల.. Minister Harish Rao

జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.156.32 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Update: 2022-12-27 07:29 GMT

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.156.32 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి జయరాజు పర్యటనలో భాగంగా కోహిర్ మండలం దిగ్వాల్ లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ లతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేసారు. కోహీర్ మండల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.46.25 కోట్ల చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ.5కోట్ల 60 లక్షల వ్యయంతో 88 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దిగ్వాల్ లో నిర్మించామని తెలిపారు. మాజీమంత్రి గీతారెడ్డి హయాంలో త్రాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు, వైద్య సేవలు అందించడంలో, బూస్టర్ డోస్ ఇచ్చే విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో టాప్ లో నిలిచిందని, అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, వైద్యులు, వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.


సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో మంచి వైద్యాన్ని, విద్యను అందిస్తున్నామని తెలిపారు. రేపటి నుండి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో వేస్తామని తెలిపారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు. కోహీర్ లో రూ.10 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని నిర్మిస్తున్నామని, ఆసుపత్రిని రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తేనున్నామని మంత్రి తెలిపారు. త్వరలో సంగమేశ్వర, బస వేశ్వర సాగునీరు ప్రాజెక్ట్ లతో గోదావరి జలాలను జహీరాబాద్ తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. తెంగాణ భూముల రేట్లు పెరగడానికి కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని పేర్కొన్నారు. అన్ని వర్గాల కోసం పని చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని మంత్రి కోరారు.

Also Read...

Telangana ప్రభుత్వ పనితీరు అద్భుతం: పంజాబ్ స్పీకర్ 

Tags:    

Similar News