మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్...?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-05-22 11:07 GMT

దిశ,పటాన్ చెరు : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల రోజు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో విధ్వంసానికి దిగి ఈవీఎం మెషిన్లను ధ్వంసం చేసిన కేసులో ఈసీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీస్ జారీ చేసిన ఏపీ పోలీసులు

    పిన్నెల్లి బ్రదర్స్ కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆచూకీ కనుక్కున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయగా కంది చౌరస్తా వద్ద వాహనాలను వదిలి పరారైనట్లు సమాచారం. అయితే కారు డ్రైవర్ పోలీసులకు దొరకడంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ జాతీయ రహదారిలో ఉన్న ఒక ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ నుంచి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

Similar News