భారత్ పెట్రోల్ బంకులో అవకతవకలు

భారత్ పెట్రోల్ బంకు లో అవకతవకులు జరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన చేశారు.

Update: 2024-05-22 09:28 GMT

దిశ, శివ్వంపేట : భారత్ పెట్రోల్ బంకు లో అవకతవకులు జరుగుతున్నాయని వినియోగదారులు ఆందోళన చేశారు. లీటర్ పెట్రోల్ కు 60 ఎంఎల్ తక్కువ వస్తుందని వినియోగదారులు ఆందోళన చేసిన ఘటన శివ్వంపేట అంజన్న పెట్రోల్ బంకులో చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల నుండి భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ తక్కువ వస్తుందని గమనించిన వినియోగదారులు బుధవారం గ్రామానికి చెందిన కొందరు యువకులు పెట్రోల్ మెజరింగ్ జార్లో పోసి కొలువగా లీటరుకు 60 ఎం.ఎల్ తక్కువ వచ్చింది వినియోగదారులు తెలిపారు.

     అదేవిధంగా పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బంది పెట్రోల్ తక్కువ వస్తుందని అడగగా మాకేం తెలియదు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై పెట్రోల్ బంకు యాజమాన్ని అడగగా అలాగే వస్తుంది అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. అంజన్న బంకు అవకతవకలను ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. 

Similar News