భయపడితే భయపెడతారు ....తిరగబడితే వెనుతిరుగుతారు : మంత్రి కొండా సురేఖ

భయపడితే..... భయ పెడతారని తిరగబడితే వెనుతిరుగుతారని హరీష్ రావు భయభ్రాంతుల నుండి సిద్దిపేట ప్రజలకు విముక్తి కలిగిందని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.

Update: 2024-05-10 14:19 GMT

దిశ, చిన్నకోడూరు : భయపడితే..... భయ పెడతారని తిరగబడితే వెనుతిరుగుతారని హరీష్ రావు భయభ్రాంతుల నుండి సిద్దిపేట ప్రజలకు విముక్తి కలిగిందని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్టులో అంతులేకుండా డబ్బులు దోసుకున్నారన్నారు. ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే తగులుతుందని, కేసీఆర్ చేసిన పాపానికి తన కూతురు జైలు పాలు అయిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసి ప్రజల మీద విపరీతమైన భారాన్ని మోపాడు అన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే మనల్ని కూడా అమ్మడానికి వెనుకాడాడని ఆమె ఎద్దేవా చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడన్నారు.

ఎన్ని దుష్టశక్తులు కుట్రలు చేసిన రాజ్యాంగాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామన్నారు .బీసీలకు పూర్తిస్థాయిలో లబ్ధి పొందుతారు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే ఒరిగేది ఏమీ లేదన్నారు. సొంత పార్టీపై నమ్మకం లేకనే హరీష్ రావు కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పుతున్నాడని, ఆయన మాటకు విలువిచ్చి మీరంతా కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలను కోరారు.

బీఆర్ఎస్ గెలిచిన సీట్లను బిజెపికి తాకట్టు పెట్టి తన కూతుర్ని విడిపించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి నీలము మధును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. నీలం మధు మాట్లాడుతూ సిద్దిపేటలో తనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు, మండల అధ్యక్షుడు మీసం మహేందర్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు బంక చిరంజీవి, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి కనకరాజు, బత్తిని గణేష్, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్. అజ్జు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News