సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయడు బసవేశ్వరుడు: మంత్రి హరీష్ రావు

సమసమాజ స్థాపన, ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం కృషి చేసిన మహనీయడు బసవేశ్వరుడని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2023-04-23 10:34 GMT

దిశ, సిద్దపేట ప్రతినిధి: సమసమాజ స్థాపన, ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం కృషి చేసిన మహనీయడు బసవేశ్వరుడని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. బసవేశ్వరుడి జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పొన్నాల చౌరస్తా వద్ద గల బసవేశ్వరుడి విగ్రహానికి మంత్రి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు విద్యా, సమాన హక్కుల కల్పించిన మహనీయుడు బసవేశ్వరుడని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ హాయాంలో హైదరాబాద్ లో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు కోసం ఎన్నిసార్లు మోరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

బీఆర్ఎస్ హాయంలో ట్యాంక్ బండ్ పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి తోడు వీర శైవ లింగాయత్ లకు హైదరాబాద్ లో మంచి స్థలంతో పాటుగా భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు. సిద్దిపేటలో సైతం వీర శైవ సమాజం కోసం స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరశైవ లింగాయత్ లకు ప్రధాన్యతను ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా కలెక్టరేట్ లో కూడా బసవేశ్వరుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వీరశైవ లింగాయత్ సమాజం ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News