బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలోని స్క్రాప్ గోడాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-05-25 14:30 GMT

దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలోని స్క్రాప్ గోడాంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోడాంలో కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో సమీపంలోని పారిశ్రామికవేత్తులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News