కందిలో మోరాయించిన ఈవీఎం మిషన్

కంది జెడ్పీహెచ్ఎస్ లో ఈవీఎం మిషన్ మోరాయించింది. దీంతో రెండు గంటలుగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది.

Update: 2024-05-13 10:45 GMT

దిశ, కంది : కంది జెడ్పీహెచ్ఎస్ లో ఈవీఎం మిషన్ మోరాయించింది. దీంతో రెండు గంటలుగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. వెంటనే అక్క డున్న సిబ్బంది సదరు విషయాన్ని పై అధికారులకు తెలియజేయడంతో మిషన్ ని సరిచేసేందుకు టెక్నికల్ టీం సభ్యులను పంపించారు. అయితే కంది లో జరుగుతున్న పోలింగ్ స్టేషన్ని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సందర్శించారు. మోరాయించిన ఈవీఎం మిషన్ని వెంటనే సరి చేయించాలని అక్కడున్న సిబ్బందిని కోరారు. మిగతా అంతటా ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. 

Similar News