మాయ మాటలు నమ్మి మోసపోవద్దు : మంత్రి కొండా సురేఖ

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంపీలను అమ్ముకుంటారని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ విమర్శించారు.

Update: 2024-05-10 11:06 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంపీలను అమ్ముకుంటారని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని ఎన్సాన్ పల్లి, పుల్లూరు, నారాయణరావు పేట గ్రామాల్లో కార్నర్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ..బీఆర్ఎస్ ను ప్రజలు గద్దె దింపిన కూడా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అందరి బతుకులు బాగుపడతాయన్నారు.

వడ్డెర సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మాయ మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏజెంట్లను భయపెట్టిన వదిలిపెట్టేది లేదని, ధైర్యంగా నిలబడి ప్రచారం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పేదింటి బిడ్డ అయినా నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేపితో బీఆర్ఎస్ కుమ్మకు అయిందన్నారు. బీజేపీ వాళ్లు పెద్దవాళ్లకు పనిచేస్తారు తప్ప పేదోళ్లను పట్టించుకోరని కొండా సురేఖ దుయ్యబట్టారు.

కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని.. ఎంపీ అభ్యర్థి నీలం మధు

పంచాయతీ సర్పంచి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలుసునని ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించాలని నీలం ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, గుడూరి శ్రీనివాస్, దరిపల్లి చంద్రం, బొమ్మల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామ మాజీ సర్పంచ్, మరికొందరు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News