కాంగ్రెస్, బీజేపీ ఫేక్ ప్రచారం తిప్పికొట్టాలి : హరీష్ రావు

కాంగ్రెస్, బీజేపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, తిప్పికొట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు యువత కు పిలుపునిచ్చారు.

Update: 2024-05-10 11:11 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్, బీజేపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, తిప్పికొట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు యువత కు పిలుపునిచ్చారు. చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన యువకులు, చెర్ల అంకిరెడ్డి గ్రామ బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరు గ్యారంటీ లు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ భృతి మాటే లేదు.. మహిళలకు ఇస్తా అన్న రూ. 2500, స్కూటీలు అమలు చేయలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సిద్దిపేట అభివృద్ధిని ఓర్వ లేని, అభివృద్ధిని అడ్డుకునే వారికి, అభివృద్ధిని అగ్రగామిగా నిలిపిన వారికి మధ్య జరుగుతున్న పోటీగా అభివర్ణించారు. యువత భవిష్యత్ బీ ఆర్ ఎస్ పార్టీ కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News