ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఆశీర్వదించి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే 2026 డిలిమిటేషన్

Update: 2024-04-29 11:35 GMT

దిశ, చేర్యాల: ఆశీర్వదించి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే 2026 డిలిమిటేషన్ లో చేర్యాల ను నియోజక వర్గ కేంద్రంగా చేస్తామని, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు చేర్యాల లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు . ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనీ ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఎంపీ గా నన్ను పార్లమెంటుకు పంపాలని కేంద్రం నుండి మరిన్ని నిధులు తెచ్చి చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.

డివిజన్ తెస్తా అన్న ఎమ్మెల్యే పల్లా ఎటు పోయిండు..

గెలిచిన 10 రోజుల్లో చేర్యాల రెవెన్యూ డివిజన్ చేస్తాం అని ఎన్నికల్లో మాట ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు కనపడకుండా పోయిండని , అయినా డివిజన్ తేనెకి వాడెవడు ప్రభుత్వ మాది, చేర్యాలను డివిజన్ తో పాటు నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తామని చామల సంచలన కామెంట్ చేశారు.

హరీష్ రావు బీజేపీకి లేదా, జైలుకు పోవడం ఖాయం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో 30 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జైలుకు పోవడం తప్పదని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీకి పోవడమో లేక తీహార్ జైలుకు పోవడం జరుగుతుందని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి హరీష్ రావుకు లేదు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి హరీష్ రావు కు లేదని , స్థాయికి నేను చాలని నీకంటే రాజకీయంలో నేను సీనియర్ అని జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచారని, అయినా నైతిక విజయం నాదేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చేర్యాలకు 10 కోట్లు మంజూరు చేసిందని ఎంపీగా చామల కిరణ్ ను గెలిపిస్తే కేంద్రం నిధులతో ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం ,మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు,కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పరమేశ్వర్ ఆగం రెడ్డి ఆడేపు చెంద్రయ్య, కౌన్సిలర్లు చెవిటి లింగం, ఆడెపు నరేందర్, సంజీవులు తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News