చట్టబద్ధంగా ఆ స్థలం నాదే : చింతా గోపాల్

గత కొన్ని రోజులుగా సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ స్థలం ఆక్రమించడం అని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వైస్ చైర్మన్ చింతా గోపాల్ గురువారం స్థానిక బసవ సేవా సదన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించి ఖండించారు.

Update: 2023-04-27 15:56 GMT

దిశ, సదాశివపేట : గత కొన్ని రోజులుగా సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ స్థలం ఆక్రమించడం అని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని వైస్ చైర్మన్ చింతా గోపాల్ గురువారం స్థానిక బసవ సేవా సదన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించి ఖండించారు. గత 28 సంవత్సరాలుగా చట్టబద్ధంగా రుజువులు ఉన్నాయని ఆ స్థలం పూర్తిహక్కులు తనకే ఉన్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రభుత్వం సద్వినియోగపరుచుకోవాలని ప్రకటించిన 59 జీవో ప్రకారం తన స్థలాన్ని క్రమబద్ధరించుకోవడం చేసే ప్రయత్నంలో తనకు గిట్టని వారు రాజకీయ కక్షతో కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను విలేకరుల ముందు ఉంచారు. ధర్మబద్ధంగా తనకు చెందాల్సిన స్థలాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News