కేసీఆర్ కు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాస్ వార్నింగ్

Update: 2024-05-08 08:50 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ సీఎం కేసీఆర్ కాన్ కోల్ కే సునో అంటూ బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాయలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పంజరంలో చిలుక లాగ బయటకు వచ్చి చిలుక పలుకులు పలుకుతున్నడన్నారు. దుబ్బాక లో ఓడిన రఘునందన్ రావు మెదక్ ఎంపీగా ఎలా గెలుస్తాడని మాట్లడితున్న కేసీఆర్ కామారెడ్డిలో బీజేపీ చేతిలో ఓడిపోయి తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ఎలా గెలిపిస్తానని ప్రశ్నించారు. ఎండ దెబ్బతగిలి హరీష్ రావుకే దమాక్ కరాబ్ అయిందనుకుంటే కేసీఆర్ కు సైతం దమాక్ కరాబ్ అయిందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచినట్లు రాధకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడిస్తున్నారని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న వారిని,

    స్థానికులను కాదని ఎన్ని కట్టలకు మెదక్ ఎంపీ సీటు వెంకట్రామిరెడ్డికి అమ్ముకున్నావని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా వెంకట్రామిరెడ్డి జిల్లా సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఎంపీగా పార్లమెంట్ కు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి, సీఎంగా సెక్రటేరియట్ కు రాని కేసీఆర్ అని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ త్యాగాలు.. యాగాలు చేయలేదని..భోగాలు అనుభవించారన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని ఆరోపించారు. సిద్దిపేట పర్యటన నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచలేదని సిద్దిపేట వేంకటేశ్వర దేవాలయంలో ప్రమాణం చేయాలని..ప్రమాణం చేయడానికి తాను సిద్దమని రఘునందన్ రావు సవాల్ చేశారు. మెదక్ లో బీజేపీ గెలుపు ఖాయం...కేసీఆర్ కుటుంబం శ్రీ కృష్ణ జన్మస్థానం చేరుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు కొత్తపల్లి వేణుగోపాల్, ఉపేందర్ రావు, విభిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Similar News