కుక్క పిల్లకు వానర ప్రేమ

జాతి వైరం మరిచి ఓ చిన్న కుక్క పిల్లను కోతి హత్తుకొని ప్రేమగా చూసుకుంటున్న సంఘటన చేగుంట మండల కేంద్రంలో కెమెరా కంట పడింది.

Update: 2024-04-16 09:13 GMT

దిశ, చేగుంట : జాతి వైరం మరిచి ఓ చిన్న కుక్క పిల్లను కోతి హత్తుకొని ప్రేమగా చూసుకుంటున్న సంఘటన చేగుంట మండల కేంద్రంలో కెమెరా కంట పడింది. స్థానిక మకరాజుపేట రోడ్ లోని అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రహరీ గోడ పై సందడి చేస్తున్న కోతులు అటుగా వచ్చిన చిన్న కుక్కపిల్లను అక్కున చేర్చుకొని లాలించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుక్క పిల్లలు అంటే పడని కోతులు ఇలా కనిపించడం అందరికీ ఆశ్చర్యపరిచింది.   


Similar News