స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్..
స్పూర్తి ప్రధాత భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు మహేష్ అన్నారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: స్పూర్తి ప్రధాత భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు మహేష్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం భగత్ సింగ్ 92వ వర్ధంతిని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించిన వీరుడు భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో సమసమాజ నిర్మాణం కోసం పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ పట్టణ అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి హిమవంత్, పీడీఎస్ యూ మహిళా విభాగం కన్వీనర్ వైష్ణవి, జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, సహాయ కార్యదర్శి ప్రదీప్, కాలేజి కమిటీ అధ్యక్షుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాదం పై పోరాటానికి సిద్ధం కావాలి..
భగత్ సింగ్ స్పూర్తితో మతోన్మాదం పై పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ కెరటం భగత్ సింగ్ అని కొనాయాడారు. భగత్ సింగ్ ఆశయాలను భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, దాసరి ప్రశాంత్, రెడ్డబోయన అరవింద్, అంజలి డేవిడ్, యాదగిరి, సంపత్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి : రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలి.. అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం